న్యూఢిలీ జూన్ 29 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థల్లో ఒకటైనా బజాజ్ ఆటో రూ.5,632.8 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయబోతున్నది. జూలై 1 నుంచి ప్రారంభం కానున్న ఈ బైబ్యాక్ అదే నెల 7న ముగియనున్నది.
పది రూపాయల ముఖ విలువ కలిగిన 46.94 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ.12 వేలు చెల్లించి కొనుగోలు చేస్తున్నది. ఇందుకోసం సంస్థ రూ.5,632 కోట్ల నిధులను వెచ్చించనున్నట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.