హైదరాబాద్, మార్చి 16: నొప్పి నివారణ నూనె‘మై డాక్టర్’ ప్రాచుర్యం పొందడంతో ఆయుర్వేద ఔషధ సంస్థ ‘హీలింగ్ హస్త’ త్వరలో మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. గురువారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సెంటర్ ఫర్ బిజినెస్ మార్కెట్స్ ప్రొఫెసర్ డీవీఆర్ శేషాద్రి కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించారు.
ముక్కు దిబ్బడను తొలగించే రిలెక్స్ ఆయిల్, శృంగార సమస్యల్ని పరిష్కరించే సిక్స్-ఈ టాబ్లెట్స్, జుత్తు రాలడాన్ని అరికట్టే కైదార్య హెర్బల్ ఆయిల్, టైటస్ స్లిమ్ పౌడర్, డాక్టర్ ఎం పెయిన్ రిలీఫ్ ఉత్పత్తుల్ని తెలుగు రాష్ర్టాల్లో ప్రవేశపెడుతున్నట్టు హీలింగ్ హస్త వ్యవస్థాపకుడు, ఎండీ డాక్టర్ మస్తాన్ యాదవ్ వివరించారు. వచ్చే ఐదేండ్లలో తమ సంస్థ ఆదాయం 25 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు.