యాక్సిస్ బ్యాంక్ లాభం 5,863 కోట్లు
ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,863 కోట్ల లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,329 కోట్లతో పోలిస్తే 10 శాతం అధికమని పేర్కొంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.5,863 కోట్ల లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.5,329 కోట్లతో పోలిస్తే 10 శాతం అధికమని పేర్కొంది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి గత త్రైమాసికంలో బ్యాంక్ రూ.815 కోట్ల నిధులను వెచ్చించింది.
ఏడాది క్రితం కేటాయించిన రూ.550 కోట్ల కంటే భారీగా పెరిగాయి. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.24,094 కోట్ల నుంచి రూ.31,660 కోట్లకు పెరిగినట్టు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19 శాతం ఎగబాకి రూ.12,315 కోట్లకు చేరుకున్నది. ఈ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ ఎండీ, సీఈవో అమితాబ్ చౌదరీ మాట్లాడుతూ..అంతర్జాతీయ దేశాల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ మరింత బలోపేతం అవుతున్నదని, అలాగే ప్రస్తుత పండుగ సీజన్లో రుణాలకు డిమాండ్ ఉంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బ్యాంక్ షేరు ధర స్వల్పంగా తగ్గి రూ.955.35 వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

