ATF Price Hike | విమాన ప్రయాణం భారమేనా.. ఏటీఎఫ్ ఆల్‌టైం పెంపు
ATF Price Hike | విమానాల్లో వాడే ఇంధన ధరలు ఆల్‌టైం స్థాయిలో పెరిగాయి. 3.22 % పెంచినట్లు కేంద్ర చమురుసంస్థలు తెలిపాయి.
ATF Price Hike |విమాన ప్రయాణం కష్టం.. భారం కాబోతున్నది. ఆదివారం విమానాల్లో వాడే ఇంధనం.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర ఆదివారం 3.22 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఏటీఎఫ్ ధరలు వరుసగా పెంచడం ఇది తొమ్మిదో నెల. అంతర్జాతీయ ఇంధన ధరలకు అనుగుణంగా ఏటీఎఫ్ ధరలు పెంచినట్లు కేంద్ర చమురు సంస్థలు నోటిఫికేషన్ జారీ చేశాయి. విమానాల్లో వాడే ఏటీఎఫ్ కిలో లీటర్‌పై రూ.3,649.13 (3.22 శాతం) పెంచడంతో దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,16,851.46 (లీటర్‌కు రూ.116.8)లకు చేరుకున్నది.
ఇదిలా ఉంటే వరుసగా 25వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. గత నెలలో చివరిసారిగా ఒకేసారి లీటర్ పెట్రోల్ లేదా లీటర్ డీజిల్‌పై రూ.10 పెంచాక మళ్లీ వాటి ధరలు పెంచలేదు. జెట్ ఫ్యూయల్ ధరలు ప్రతి నెలా ఒకటో తేదీ, 16న పెంచుతారు. అంతర్జాతీయ ధరలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజూ కేంద్ర చమురు సంస్థలు సవరిస్తుంటాయి.
ప్రస్తుతం ముంబైలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,15,617.24 కోల్‌కతాలో రూ.1,21,430.48, చెన్నైలో రూ.1,20,728.03 పలుకుతుంది. ఆయా రాష్ట్రాల వారీగా స్థానిక పన్నులను బట్టి ధరలు మారుతాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతుండటంతో ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. విమాన నిర్వహణలో 40 శాతం ఏటీఎఫ్ కొనుగోలుకే ఖర్చు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరలు పెంచడంతో ఏటీఎఫ్ ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

