Tesla Import Duty Clash | భారీగా ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించాలన్న గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా చేసిన విజ్ఞప్తిపై దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు నిట్ట నిలువునా చీలిపోయాయా? అంటే అవుననే తెలుస్తున్నది. మరో రెండు వారాల్లో విపణిలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించనున్న ఓలా ఎలక్ట్రిక్.. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు సమాచారం. టెస్లా ప్రతిపాదన పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు వినికిడి.
హ్యుండాయ్ మోటార్స్ ఇండియా, బజాజ్ ఆటో మాత్రం దిగుమతి సుంకాలు తగ్గించాలన్న అభ్యర్థనకు మద్దతుగా నిలిచినట్లు తెలియ వచ్చింది. దేశీయంగా భారీ స్థాయిలో ఉత్పత్తి లక్ష్యాలను చేరుకునే లోపు విదేశాల నుంచి వచ్చే కార్లపై దిగుమతి సుంకాలను తగ్గించడం వల్ల భారీగా విద్యుత్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని హ్యుండాయ్, బజాజ్ ఆటో వాదిస్తున్నాయి.
మరోవైపు ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) మధ్యేమార్గంగా విడి భాగాలను తయారు చేయాలని టెస్లాను ఆహ్వానించింది. దేశీయ ఆటోమొబైల్ రంగ పరిశ్రమలో విడి భాగాల ఇండస్ట్రీ 46 బిలియన్ల డాలర్ల టర్నోవర్ కలిగి ఉంది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-2) కింద ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయంగా దశల వారీ ఉత్పత్తి ( Phased Manufacturing Plan (PMP) పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏసీఎంఏ అధ్యక్షుడు దీపక్ జైన్ గుర్తు చేశారు.
దేశీయ, విదేశీ సంస్థల్లో కొత్త వాటికి ఆటోమోటివ్ కాంపొనెంట్స్ ఇండస్ట్రీ స్వాగతం పలుకుతుందని దీపక్ జైన్ వెల్లడించారు. లోకలైజేషన్‌ను ప్రోత్సహిస్తామని తెలిపారు. అయితే నూతన సంస్థలు గుడ్ లోకలైజేషన్ ప్లాన్‌తో ముందుకు రావాలని కోరారు. టెస్లాతోపాటు గ్లోబల్ వెహికల్ తయారీ సంస్థలను స్థానికంగా కార్లను, ఇతర వాహనాలను ఉత్పత్తి చేసేందుకు త్వరితగతిన కేంద్రం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీంతో ముందుకు రావాలని అభ్యర్థించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ola bookings|.. రూ.499 చెల్లిస్తే సరి.. ఈ-స్కూటర్ రెడీ..!
ఓలా ఈ-స్కూటర్‌ను ఎలా నడుపాలో తెలుసా..?!
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!