అరబిందో భారీ లావాదేవీ!
- ఇంజెక్ట్‌బుల్ వ్యాపారంలోబ్లాక్స్టోన్కు మెజారిటీ వాటా
న్యూఢిల్లీ, మార్చి 21: హైదరాబాదీ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మాకు చెందిన ఇంజెక్ట్‌బుల్ వ్యాపారంలో ప్రధాన వాటాను గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ బ్లాక్‌స్టోన్ చేజిక్కించుకునే అవకాశాలున్నాయని ఈ లావాదేవీతో సంబంధమున్న పలు వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వాటాను కొనుగోలు చేసేందుకు మూడు గ్లోబల్ ఫండ్స్..బ్లాక్‌స్టోన్, బేరింగ్స్ పీఈ ఆసియా, కేకేఆర్‌లు ఇప్పటికే అరబిందోతో చర్చలు జరిపాయని, బ్లాక్‌స్టోన్‌కు డీల్ ఖరారుకావొచ్చని ఆ వర్గాలు వివరించాయి. ఇంజెక్ట్‌బుల్ వ్యాపారాన్ని తన సబ్సిడరీ యుగియా ఫార్మా స్పెషాలిటీస్‌కు బదిలీ చేయాలని 2021 మే నెలలో అరబిందో ఫార్మా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇందులో మెజారిటీ వాటా విక్రయానికి వివిధ పీఈ ఫండ్స్‌తో చర్చలు జరుపుతున్నది. అరబిందో ఫార్మాకు ఉన్న మొత్తం ఇంజెక్ట్‌బుల్ వ్యాపారానికి 3.4-4 బిలియన్ డాలర్ల్ల (రూ.26,000-30,000 కోట్లు) విలువను ఈ డీల్‌కు అడ్వయిజర్‌గా వ్యవహరిస్తున్న కొటక్ మహీంద్రా క్యాపిటల్ నిర్దారించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.
డీల్ తర్వాత డీమెర్జర్
ప్రధాన వాటా విక్రయం తర్వాత యూగియా ఫార్మా స్పెషాలిటీస్‌ను అరబిందో నుంచి వేరుపరుస్తారని, అదేరీతిలో లిస్టెడ్ కంపెనీ అయిన అరబిందో ఫార్మాను రెండుగా విభజిస్తారని విశ్లేషకులు చెపుతున్నారు. యూగియా డీమెర్జర్, పునర్వ్యవస్థీకరణ వంటి ప్రత్యామ్నాయలను అన్వేషించేందుకు అరబిందో ఫార్మా బోర్డు..స్వతంత్ర డైరెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ఇటివల అరబిందో ఫార్మా సీఎఫ్‌వో సుబ్రమణియన్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

