న్యూఢిల్లీ, ఆగస్టు 19: చైనాలో ఏర్పాటు చేసిన ఫార్మా యూనిట్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నట్లు, పూర్తి స్థాయిలో మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి అందుబాటులోకి రానున్నట్లు అరబిందో ఫార్మా సీఎఫ్‌వో సంతానం సుబ్రమణియన్ తెలిపారు. అలాగే ఏపీలో రూ.2,400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయతలపెట్టిన పెన్-జీ ప్లాంట్‌కు పీఎల్ఐ స్కీం కింద అనుమతి లభించిందని, ప్రతియేటా ఈ యూనిట్లో 15 వేల టన్నుల ఔషధాలు ఉత్పత్తి కానున్నయన్నారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర సర్కార్ పీఎల్ఐ స్కీంను ప్రవేశపెట్టింది. ఈ స్కీం కింద ఎంపికైన ప్లాంట్లకు పలు రాయితీలు లభించనున్నాయి. అమెరికాలో ఔషధాల ధరలు తగ్గుముఖం పట్టడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సంస్థ లాభాలపై ప్రభావం చూపుతున్నదని, ఇదే ట్రెండ్ భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశాలున్నాయన్నారు.