August Bank Holidays | ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు జరుపడం సర్వ సాధారణం.. డిజిటల్ చెల్లింపులు పెరిగినా.. ప్రజానీకం తమ ఖాతాలు ఉన్న బ్యాంకు శాఖలకు వెళ్లడం మాత్రం ఇంకా తగ్గడం లేదు. అయితే, మిగతా వారి మాదిరిగానే బ్యాంకు ఉద్యోగులకు సెలవులు ఉంటాయి. కనుక రోజువారీ బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేవారికైతే.. సెలవులు ఎప్పుడు ఉన్నాయో తెలుస్తుంది. అలా కాకుండా అప్పుడప్పుడు బ్యాంకు శాఖలకు వెళ్లే వారికి పూర్తి వివరాలు తెలియవు. కనుక ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే లావాదేవీలు జరుపడం తేలికవుతుంది. వచ్చే నెల (ఆగస్ట్)లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 18 రోజులు బ్యాంకులు పని చేయవు. ఆగస్ట్ 11న రక్షాబంధన్ సందర్భంగా బ్యాంకులు సెలవు. నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు బ్యాంకులు పని చేయవు.
ఆగస్టు 13 నుంచి 15 వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకింగ్ లావాదేవీలు ఉండవు. 13న రెండో శనివారం, 14న ఆదివారం, 15న దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వరుసగా మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కనుక బ్యాంకులకు వెళ్లే వారు వచ్చే నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుంటే తేలిగ్గా ఉంటుంది. ఆగస్ట్‌లో బ్యాంకులకు సెలవులు ఇలా..
తేదీ —— సెలవు కారణం ——————– ఏయే ప్రాంతాల్లో సెలవు
1 ——– దృపక షీ-జీ పండుగ ————– సిక్కిం
7 ——– ఆదివారం ————————– దేశమంతా
8 ——– మొహరం ————————— జమ్ముకశ్మీర్
9 ——– మొహరం ————————— పలు ప్రదేశాల్లో సెలవు
11 ——- రక్షాబంధన్ ————————- అహ్మదాబాద్, భోపాల్, జైపూర్, సిమ్లా
12 ——- రక్షాబంధన్ ———————— కాన్ఫూర్, లక్నో
13 ——- రెండో శనివారం ——————- దేశమంతా
14 ——- ఆదివారం ————————- దేశమంతా
15 ——- స్వాతంత్య్ర దినోత్సవం ——— దేశమంతా
16 ——- పార్శీ నూతన సంవత్సరాది—– నాగ్‌పూర్, ముంబై
18 ——- జన్మాష్టమి ———————— భువనేశ్వర్, చెన్నై, కాన్పూర్, లక్నో
19 ——- జన్మాష్టమి ———————— అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, చెన్నై, గ్యాంగ్‌టక్, జైపూర్, జమ్ము, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్
20 ——- శ్రీకృష్ణాష్టమి ——————— హైదరాబాద్
21 ——- ఆదివారం ———————– దేశమంతా
27 ——- 4వ శనివారం ——————- దేశమంతా
28 ——- ఆదివారం ———————– దేశమంతా
29 ——-శ్రీమంత్ శంకర్‌దేవ్ జయంతి — గువహాటి
31 ——- గణేష్ చతుర్థి ——————- అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్, పనాజీ