Attrition in IT | టెక్ నిపుణుల కొరత.. భారీ వేతనాలిస్తాం రండి అంటున్న విప్రో, ఇన్ఫోసిస్
Attrition in IT | గ్లోబల్ క్లయింట్ల కోసం ఐటీ దిగ్గజాల్లో అట్రిక్షన్ పెరిగింది.. ఇన్ఫీ, విప్రో 3 నెలల్లో 26 వేల మందిని నియమించుకున్నాయి.

Attrition in IT | కరోనా తర్వాత యావత్ ప్రపంచమే మారిపోయింది. అంతా డిజిటల్ మయమవుతున్నది. సాఫ్ట్వేర్ మొదలు ప్రతి రంగం వర్క్ ఫ్రం హోం సంస్కృతి మొదలైంది. సాఫ్ట్వేర్ రంగంలో అనూహ్య మార్పులు.. డిజిటల్ సేవలు పెరగడంతో సాఫ్ట్వేర్ నిపుణులకు గిరాకీ పెరిగింది.. రెండేండ్లుగా వర్క్ ఫ్రం హోం విధానం అమలవుతుండటంతో ఐటీ సంస్థలకు ప్రాజెక్టులు పెరిగినంతగా సిబ్బంది పెరగడం లేదు. అందుకు అనుగుణంగా నిపుణులు లేక సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థల మధ్య నిపుణుల కోసం అన్వేషణ.. ఐటీ నిపుణుల పరిభాషలో చెప్పాలంటే అట్రిక్షన్ ( Attrition ). అంటే ఒక సంస్థలో పని చేస్తున్న నిపుణుడికి అంత కంటే ఎక్కువ వేతన ప్యాకేజీతో ఆకర్షిస్తున్నాయి ఐటీ దిగ్గజ సంస్థలు. గత ఏడాది కాలంలో ఆ అట్రిక్షన్స్ ఎక్కువయ్యాయి. దేశీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రోల్లో అట్రిక్షన్ రేటు పెరిగిపోయింది.
మూడు నెలల్లో ఇన్ఫీ, విప్రో ఇలా
గత మూడు నెలల్లో ఇన్ఫీ.. విప్రో సుమారు 26 వేల మంది నిపుణులను కొత్తగా నియమించుకున్నాయి. గ్లోబల్ క్లయింట్లకు సకాలంలో సేవలందించడానికి ఇన్ఫీ 25.5 శాతం మంది ఐటీ నిపుణులను అట్రిక్షన్ ద్వారా కొత్తగా నియమించుకున్నది. ఇన్ఫి డిసెంబర్ నాటికి కొత్తగా 15,125 మందిని నియమించుకున్నది. దీంతో మొత్తం ఇన్ఫోసిస్ ఫ్యామిలీలో 2,92,067 మంది నిపుణులు ఇప్పుడు సేవలందిస్తున్నారు.
మెరికల్లాంటి నిపుణులకు అట్రిక్షన్ ఓ వరం
ఇక విప్రోలో ఇది ( Attrition ) 22.7 శాతం. తొలి రెండు త్రైమాసికాల్లో అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 20.5 శాతం, 15.5 శాతం సిబ్బందిని కొత్తగా నియమించుకున్నది. గత త్రైమాసికంలో 10.306 మందిని నియమించుకున్నది. దీంతో విప్రో మొత్తం సిబ్బంది 2,31,671 మందికి చేరుకున్నది. ఏడాది కాలంలో కొత్తగా 41,363 మంది విప్రోలో జాయినయ్యారు. ఓవరాల్‌గా డిజిటల్ టాలెంట్‌కు డిమాండ్ పెరగడంతో ఇండియన్ ఐటీ సంస్థలు గత ఏడాది కాలంగా అట్రిక్షన్స్.. ఇతర సంస్థల్లో పని చేస్తున్న మెరికల్లాంటి నిపుణులను అద్భుతమైన ప్యాకేజీతో ఆకర్షిస్తున్నాయి.
విప్రోలో నాలుగేండ్లతో సమానంగా 9 నెలల నియామకాలు
గత 11 త్రైమాసికాల్లో కొత్తగా నియమించుకున్న నిపుణులతో సమానంగా గత మూడు త్రైమాసికాల్లో నియమించుకున్నామని విప్రో సీఈవో థెర్రీ డెలాపోర్టే చెప్పారు. గ్రోత్ రేట్ దెబ్బతినకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన టాలెంట్ పూల్ నిర్మాణంపై ఫోకస్ చేశామని తెలిపారు. 2022లో కొత్తగా 70 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకునే విషయమై దృష్టి సారించామన్నారు. మరికొన్ని త్రైమాసికాల్లోనూ అట్రిక్షన్ కొనసాగే అవకాశం ఉందన్నారు. తమ మాదిరిగానే ఇతర సంస్థల అట్రిక్షన్స్ నుంచి సిబ్బందిని కాపాడుకునేందుకు విప్రో గత త్రైమాసికంలో 80 శాతం సిబ్బందికి రెండోరౌండ్ వేతనాలు పెంచేసింది.
ప్రతిభావంతుల కోసం ఇన్ఫీ ఇన్వెస్ట్మెంట్స్
ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నిలంజన్ రాయ్ మాట్లాడుతూ ప్రతిభావంతుల నియామకానికి పెట్టుబడులు పెంచుతున్నట్లు చెప్పారు. గ్రోత్ యాంబిషన్స్కు సపోర్ట్‌గా 2022లో 55 వేల మందికి పైగా నియమించుకుంటామని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

