Ather Energy 450S | ఓలా ఎలక్ట్రిక్ ప్రత్యర్థి.. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్టార్టప్ కంపెనీ ఎథేర్ ఎనర్జీ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘450ఎస్’ వచ్చేనెల మూడో తేదీన ఆవిష్కరించనున్నది. అధికారిక వెబ్సైట్ నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఎథేర్ ‘450ఎస్’ స్కూటర్ కొనుక్కోవాలని భావించే వారు రూ.2,500 పే చేసి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.
ఇటీవలే ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ రిలీజ్ చేసింది ఎథేర్ ఎనర్జీ. ఈ స్కూటర్ ధర రూ.1,29,999 (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుందని తెలిపింది. డిజిటల్ ఎల్ఈడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తున్నదీ స్కూటర్.
సింగిల్ చార్జింగ్ తో ‘450ఎస్’ స్కూటర్ 115 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. కేవలం 3.9 సెకన్లలో 40 కి.మీ. స్పీడ్ అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 90 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. 450ఎస్’ స్కూటర్ పూర్తిగా 450ఎక్స్’ ఆధారంగా రూపుదిద్దుకున్నా , 7.0- అంగుళాల టచ్ స్క్రీన్ కంటే కలర్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది.
ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 స్కూటర్‌కి పోటీగా ఎథేర్ ఎనర్జీ 450ఎస్ స్కూటర్ వస్తున్నది. ఎథేర్ 450ఎస్ సింగిల్ చార్జింగ్‌తో 115 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఓలా ఎస్1 స్కూటర్ 101 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. రెండు స్కూటర్లు కూడా గరిష్టంగా గంటకు 90 కి.మీ. దూరం ప్రయాణిస్తాయి.