Asus ROG Phone 9 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అసుస్.. తన అసుస్ రోగ్ ఫోన్ 9 సిరీస్ ఫోన్లను ఈ నెల 19న గ్లోబల్ మార్కెట్లలో ఆవిస్కరించనున్నది. త్వరలో భారత్ మార్కెట్లలో ఈ ఫోన్ ఆవిష్కరిస్తారు. 185 హెర్ట్జ్ ఎల్టీపీఓ ఫ్లాట్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. అప్ గ్రేడెడ్ అనిమీ విజన్ ఫీచర్ తోపాటు ఏఐ ఫీచర్లు కూడా ఉంటాయి. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్ సెట్, అనిమీ విజన్ మద్దతుతో ఏఐ బ్యాక్డ్ కెమెరాలు ఉంటాయి. 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీతో వస్తోందీ ఫోన్. 65వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ రోగ్ యూఐ వర్షన్ ఓఎస్ సిస్టమ్ తో పని చేస్తుంది.
అసుస్ రోగ్ ఫోన్ 9 ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) శాంసంగ్ ఫ్లెక్సిబుల్ ఎల్టీపీఓ అమోలెడ్ స్క్రీన్, 2500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. అసుస్ రోగ్ ఫోన్ 9 ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 1/1/56 అంగుళాల 50-మెగా పిక్సెల్ సోనీ ల్వైతియా 700 ప్రైమరీ సెన్సర్ కెమెరా, 13 -మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్, 5- మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉంటాయి.