Asus Laptops | ప్రముఖ తైవాన్ టెక్నాలజీ సంస్థ అసుస్ ఇండియా.. గ్లోబల్ మార్కెట్‌తోపాటు భారత్ మార్కెట్లో తన జెన్ బుక్, వివో బుక్ సిరీస్ అప్ డేట్ లాప్టాప్లను ఆవిష్కరించింది. జెన్ బుక్, వివోబుక్ లతోపాటు 15 కొత్త మోడల్స్ ఆవిష్కరించింది.
అసుస్ జెన్ బుక్ ఎస్13 ఓఎల్ఈడీ అనే పేరిట వచ్చిన ఓఎల్ఈడీ లాప్ టాప్ పూర్తిగా స్లిమ్‌గా ఉంటది. కేవలం సెం.మీ మందం, కిలో బరువు మాత్రమే ఉంటుంది. ఈ లాప్ టాప్ 13 జెన్ ఇంటెల్ కోర్ ఐ-ప్రాసెసర్ విత్ 32 జీబీ ఎల్పీడీడీఆర్5 రామ్ విత్ ఒక టిగాబైట్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. జెన్ బుక్ ఎస్13 ఓఎల్ఈడీ లాప్ టాప్ 13-అంగుళాల 2.8కే అసుస్ ల్యుమినా ఓఎల్ఈడీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఇది బాసాల్ట్ గ్రే, పాండర్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
జెన్‌బుక్ ఎస్ 13 ఓఎల్ఈడీ (Asus Zenbook S 13 OLED) లాప్ టాప్‌తోపాటు మార్కెట్లోకి అసుస్ జెన్ బుక్ 14 ఫ్లిప్ ఓఎల్ఈడీ కన్వర్టబుల్ లాప్ టాప్ విత్ 360-డిగ్రీస్ హింగ్ వస్తున్నది. ఇది 14 అంగుళాల 2.8కే 90హెర్ట్జ్ అసుస్ ల్యుమినా ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ లాప్ టాప్ ‘ఇంటెల్ ఐ7, ఐ5 సీపీయూ, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్, 16 జీబీ ఎల్పీడీడీఆర్5 రామ్’ వేరియంట్లలో అందుబాటులోకి వస్తున్నది. ఈ లాప్ టాప్ 512 జీబీ రామ్ విత్ ఒక టిగా బైట్ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. టూ థండర్ బోల్డ్4, యూఎస్బీ 3.2 జెన్ 2 (టైప్-ఏ), హెచ్డీఎంఐ 2.1, వై-ఫై 6ఈ కనెక్టివిటీ ఆప్షన్లు కలిగి ఉంటుంది. గ్లాస్ టచ్ ప్యాడ్, అసుస్ పెన్ 2.0 స్టైలస్ ఫీచర్లు కూడా ఉంటాయి.
అసుస్ వివోబుక్ ఎస్ ఓఎల్ఈడీ లాప్ టాప్ 15.6 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ ప్లేతోపాటు మూడు రంగుల ఆప్షన్ల (కూల్ సిల్వర్, సోలార్ బ్లూ, క్రీమ్ వైట్)లో లభిస్తుంది. ఇంటెల్ కోర్ ఐ9, ఐ7, ఐ5, 16జీబీ ఎల్పీడీడీఆర్5 రామ్, 512 జీబీ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ తదితర సీపీయూ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తున్నది. థండర్ బోల్ట్ యూఎస్బీ పోర్ట్స్, వై-ఫై 6ఈ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులోనూ గ్లాస్ టచ్ ప్యాడ్ ఫీచర్ ఉంటది.
అసుస్ వివోబుక్ 15 ఓఎల్ఈడీ లాప్ టాప్ లైట్ వెయిట్, డ్యూరబుల్‌గా ఉంటది. ఇది 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ అసుస్ ల్యుమినా ఓఎల్ఈడీ డిస్ ప్లేతో వస్తున్నది. అత్యాధునిక ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ విత్ 16 జీబీ డీడీఆర్4 రామ్ (24 జీబీ వరకు అప్ గ్రేడ్) అండ్ 512 జీబీ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఇది ఇండీ బ్లాక్, ట్రాన్స్ పరెంట్ సిల్వర్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
ఇంకా అసుస్ వివో బుక్ 16 లాప్ టాప్ కూడా ఆవిష్కరించింది. ఇది 13 జెన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ తో వస్తున్నది. ఇది 16 జీబీ డీడీఆర్ 4 రామ్ (24 జీబీ వరకు అప్ గ్రేడబుల్), 512 జీబీ స్టోరేజీ, ఐరిస్ ఎక్స్ గ్రాఫిక్స్ ఆప్షన్ కలిగి ఉంటుంది. నూతన లాప్ టాప్ల్లో జెన్ బుక్ సిరీస్ రూ.97,990, వివో బుక్ సిరీస్ రూ.47,990 లకు లభిస్తాయి. అన్ని రకాల ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్, రిటైల్ ఔట్ లెట్లలోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు.