ప్రభుత్వ బ్యాంకులకు ప్రైవేటీకరణ ముప్పు.. మోదీ సర్కార్పై అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య ధ్వజం
ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం 55వ భారత బ్యాంక్ జాతీయీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. సర్కారీ బ్యాంకులపట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది.
గౌహతి, జూలై 18: ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేటీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం 55వ భారత బ్యాంక్ జాతీయీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. సర్కారీ బ్యాంకులపట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ బ్యాంకులదే కీలకపాత్రని, అయినప్పటికీ ప్రైవేటీకరించబడుతున్నాయని ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి రూపం రాయ్ ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
వ్యవసాయ, చిన్న, మధ్యతరహా సంస్థలు, విద్య, మౌలిక రంగాలకు ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయని, నేడు కోట్లాది మంది భారతీయులకు బ్యాంకింగ్ సేవలు చేరువయ్యాయంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే కారణమని గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాలను ఉపసంహరిస్తూ, విలీనాలు చేస్తూ పోతున్న విషయం తెలిసిందే. 1969 జూలై 19న ప్రభుత్వ బ్యాంకుల జాతీయీకరణ అమల్లోకి వచ్చింది. కాగా, బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదని, ఎస్బీఐలో 1,900 మంది ఖాతాదారులకు ఒక్క ఉద్యోగి చొప్పున ఉన్నారని రాయ్ తాజా ప్రకటనలో మండిపడ్డారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

