జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్‌కు ఏఎస్‌క్యూ అవార్డు
ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన విమానయాన సేవలను అందించే విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిలిచింది. ప్రయాణికుల సంఖ్య, సిబ్బంది పనితీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలను పరిగణనలోకి తీసుకొని నిర్వహించిన రియల్ టైం సర్వేలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విమానాశ్రయాల్లో జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ నిలిచిందని పేర్కొంది.
- నాణ్యమైన పౌర విమాన సేవలకు అంతర్జాతీయ గుర్తింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11(నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన విమానయాన సేవలను అందించే విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిలిచింది. ప్రయాణికుల సంఖ్య, సిబ్బంది పనితీరు, ఆహ్లాదకరమైన వాతావరణం, పరిశుభ్రమైన పరిసరాలను పరిగణనలోకి తీసుకొని నిర్వహించిన రియల్ టైం సర్వేలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విమానాశ్రయాల్లో జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ నిలిచిందని పేర్కొంది.
ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఇచ్చే ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాల్టీ(ఏఎస్‌క్యూ)లో మంచి స్కోరింగ్‌తో మరోసారి గుర్తింపు లభించింది. 2023 సంవత్సరానికిగాను ఆసియా-పసిఫిక్ ప్రాం తాల్లో 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికులు ప్రయాణించే 400కి పైగా విమానాశ్రయాల్లో పనితీరు ఆధారంగా రూపొందించిన నివేదికలో హైదరాబాద్ విమానాశ్రయం అవార్డును సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది.
ప్రయాణికుల రాకపోకలు, సిబ్బంది పనితీరు, వసతులు వంటి 30కి పైగా అంశాలను ప్రామాణికంగా చేసుకొని నిర్వహించిన ఈ సర్వేలో మంచి స్కోరింగ్‌తో ఈ అవార్డును సొంతం చేసుకున్నట్లు, విమానాశ్రయం ద్వారా ప్రయాణించే వారికి మెరుగైన సేవలకు అధికప్రాధాన్యతనిస్తున్నట్లు జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ అన్నారు. మెరుగైన ఎయిర్‌పోర్టు మౌలిక వసతులు, నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించి విమానాశ్రయ సౌకర్యవంతమైన అనుభవాలను అందించడానికి సహకరిస్తుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

