ముంబై, సెప్టెంబర్ 29: పిరమల్ గ్రూప్ అతిపెద్ద టేకోవర్‌ను పూర్తిచేసింది. దివాలా ప్రక్రియలో ఉన్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) రుణదాతలకు రూ.34,250 కోట్లు చెల్లించడం ద్వారా ఆ కంపెనీని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు బుధవారం పిరమల్ ఎంటర్ప్రైజెస్ (పీఈఎల్) ప్రకటించింది. ఈ మొత్తాన్ని పిరమల్ క్యాపిటల్, హౌసింగ్ ఫైనాన్స్ (పీసీహెచ్‌ఎఫ్‌ఎల్) నగదు, ఎన్సీడీల రూపంలో చెల్లించిందని పిరమల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమల్ మీడియాకు తెలిపారు. డీహెచ్ఎఫ్ఎల్ పరిష్కార ప్రక్రియలో ఫిక్స్డ్ డిపాజిట్హోల్డర్లతో సహా రుణదాతలు రూ.38,000 కోట్లు రికవరీ చేసుకుంటారని, తాము చెల్లించిన రూ.34,250 కోట్లతో పాటు డీహెచ్ఎఫ్ఎల్ వద్ద ఉన్న నగదు నిల్వ రూ.3,800 కోట్లు కూడా రుణదాతలకు చెందుతుందని అజయ్ వివరించారు. తాము పీసీహెచ్‌ఎఫ్‌ఎల్, డీహెచ్ఎఫ్ఎల్ను విలీనం చేస్తామని, విలీన కంపెనీని పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా వ్యవహరిస్తామన్నారు. టేకోవర్‌పై అజయ్ పిరమల్ వెల్లడించిన వివరాలివీ…