న్యూఢిల్లీ, ఆగస్టు 16: కృత్రిమ మేధస్సు సీఏలకు దన్నుగా నిలువనున్నదని, ముఖ్యంగా తమ క్లయింట్లకు నాణ్యమైన సేవలు అందించడానికి, లావాదేవీల సంఖ్య పెరిగేందుకు దోహదం చేయనున్నదని ఐసీఏఐ ప్రెసిడెంట్ అంకిత్ సునీల్ తలాటి తెలిపారు. ప్రస్తుతం ఐసీఏఐలో 3.80 లక్షల మంది సభ్యులు, 8 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
పలు రంగాల్లో వినియోగిస్తున్న ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి నూతన టెక్నాలజీ సేవలు కూడా అకౌంటింగ్లోనూ వినియోగిస్తున్నారని చెప్పారు.