హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): సామాజిక, ఆర్థిక రంగాలను ప్రభావితం చేయగల స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న ఆర్థ స్కూల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్.. టీ హబ్‌తో జత కట్టింది.
టీ హబ్ సీఈవో ఎం.ఎస్.రావుతో కలిసి ఆర్థ స్కూల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రత్యేకంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. టీ హబ్ కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్‌ల కార్యకలాపాలను దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ఉన్న అవకాశాలను కనిపెట్టడం, వాటిని ప్రోత్సహించేందుకే ఈ ఒప్పందం చేసుకున్నట్టు టీ హబ్ తెలిపింది.