హైదరాబాద్, మే 20: ఆక్వాకల్చర్ ఫీడ్స్, ఫార్ములేషన్ సంస్థ గ్రోవెల్ గ్రూపు.. తాజాగా పెంపుడు జంతువుల ఆహార రంగంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గ్రూపు ప్రమోటర్ కార్తీక్ మాట్లాడుతూ..భారత్లో పెంపుడు జంతువుల ఆహార రంగం భారీగా పుంజుకుంటున్నదని, దీంతో ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో అడుగుపెట్టినట్టు చెప్పారు.
ప్రస్తుతం సంస్థకు నాలుగు ప్లాంట్లు ఉండగా, తాజాగా మరో రెండు యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. వచ్చే ఐదు నుంచి ఏడేండ్లకాలంలో రూ.80-100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.