హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): డిజిటల్ రంగంలో మహిళా పారిశ్రామిక వేత్తల విజయాలను గుర్తించి, వారిని మరింత ప్రోత్సహించేందుకు టీహబ్, వీ హబ్ సహకారంతో షీ ది పీపుల్ సంస్థ డిజిటల్ ఉమెన్ అవార్డుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డిజిటల్ రంగంలో ఔత్సాహిక మహిళలు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. 2024 ఎడిషన్ అవార్డుల కోసం ఈ లింకులో (https://docs.google.com /forms/) సంప్రదించాలన్నారు.
నాబార్డ్ సీజీఎంగా ఉదయ్ భాస్కర్
హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్‌గా బీ ఉదయ్ భాస్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈయనకు నాబార్డ్‌లో 31 సంవత్సరాల అనుభవం ఉంది.