హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. హైదరాబాద్‌లో భారీ విస్తరణకు ముందుకొచ్చింది. నగరంలోని గచ్చిబౌలి వేవ్‌రాక్ ఐటీ పార్క్‌లో అదనంగా 57,343 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది.
చదరపు అడుగుకు నెలకు రూ.125 చొప్పున ప్రతి నెలా రూ.71.67లక్షలు అద్దె చెల్లించనుంది. హైదరాబాద్‌లో యాపిల్‌కు ఇప్పటికే ఆఫీస్ స్పేస్ ఉండగా.. తాజా లీజుతో మొత్తం 6.34 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఈ లీజు గతేడాది డిసెంబర్ 1 నుంచి ఐదేండ్ల పాటు అమల్లో ఉండనున్నది.