Apple Work From Office | టెక్ దిగ్గజం ఆపిల్ తన సిబ్బందికి వర్క్ ఫ్రం ఆఫీస్‌కు డెడ్‌లైన్ ఖరారుచేసింది. వచ్చేనెల 11 నాటికి అమెరికాలోని కార్పొరేట్ ఉద్యోగులు విధులకు హాజరు కావాలని లక్ష్యం నిర్దేశించింది. గతేడాది జూన్ నుంచి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడానికి ఆపిల్ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. కానీ 2021 శరదృతువు, శీతాకాలం మధ్య కరోనా కేసులు పెరగడంతో ఆ నిర్ణయం వాయిదా పడింది.
వచ్చేనెల 11 నుంచి ఉద్యోగులు వారానికి ఒకరోజు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని సిబ్బందికి సీఈవో టిమ్ కుక్ పంపిన మెమోలో పేర్కొన్నారు. వచ్చేనెల 11 నుంచి మూడు వారాల తర్వాత ప్రతివారంలో రెండు వారాలు, మే 23 నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాలని ఆ మెమోలో టిమ్‌కుక్ తెలిపారు. దీనిపై స్పందించడానికి ఆపిల్ నిరాకరించింది.
కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ఫైనాన్సియల్, టెక్నాలజీ కంపెనీలతోపాటు సిబ్బందిని ఆఫీసులకు రప్పించేందుకు ఆపిల్ కూడా పోటీ పడుతున్నది. మరో టెక్ దిగ్గజం అల్ఫాబెట్ అనుబంధ గూగుల్ కూడా అమెరికా, బ్రిటన్, ఆసియా-పసిఫిక్ ఆఫీసుల పరిధిలో సిబ్బందిని వచ్చేనెల 4 నుంచి వారానికి మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిన అవసరం ఉందని తెలిపింది.