iPhone 17 Series | క్యాలిఫోర్నియా/కూపర్టినో, సెప్టెంబర్ 9: ఐఫోన్ కస్టమర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 17 సిరీస్ మొబైల్స్ వచ్చేశాయి. మంగళవారం ఇక్కడ యాపిల్ సంస్థ ఐఫోన్ 17 సిరీస్‌లో 4 ఫోన్లను ఘనంగా ఆవిష్కరించింది. అలాగే యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో3, మరో మూడు స్మార్ట్వాచీలనూ విడుదల చేసింది.
మునుపెన్నడూ లేనివిధంగా అతి పల్చని రూపంలో కనువిందు చేస్తున్న ఈ ఫోన్లలో 48 మెగాపిక్సల్ కెమెరాను తీసుకొచ్చారు. 6 అంగుళాలకుపైగా డిస్ప్లే, 8/12జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజీలు, అత్యాధునిక ప్రాసెసర్లతో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్‌పాడ్స్, స్మార్ట్‌వాచీల్లో ఆరోగ్య సంబంధిత టెక్నాలజీని అభివృద్ధి చేశారు.