న్యూఢిల్లీ : భారత్ మార్కెట్‌పై యాపిల్ (Apple) ప్రత్యేక దృష్టి సారించిన క్రమంలో అందుకు తగ్గట్టే భారత్ నుంచి రికార్డు స్ధాయిలో అత్యధిక రాబడిని కంపెనీ ఆర్జించింది. భారత్‌లో ఆల్‌టైం హై రేంజ్ రాబడిని యాపిల్ నమోదు చేసింది. భారత్ తమకు అసాధారణ మార్కెట్ అని కంపెనీ సీఈవో టిమ్ కుక్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌లో యాపిల్ ఢిల్లీ, ముంబైలో తన తొలి స్టోర్లను ఓపెన్ చేసింది.
ఆ సమయంలో భారత్‌ను సందర్శించిన టిమ్ కుక్ స్వయంగా ఈ స్టోర్స్‌ను ప్రారంభించారు. భారత్ మార్కెట్లో తమకు అపార అవకాశాలున్నాయని ఇన్వెస్టర్స్ కాల్ సందర్భంగా కుక్ మరోసారి దేశీ మార్కెట్‌పై ప్రశంసలు గుప్పించారు. భారత్‌లో తాము అత్యధిక రెవెన్యూ రికార్డు సాధించామని, రెండంకెల వృద్ధి రేటు నమోదు చేశామని చెప్పారు.
భారీ మార్కెట్లో తమకు తక్కువ శాతం వాటా ఉండటంతో రాబోయే రోజుల్లో అద్భుతమైన వృద్ధికి అవకాశాలున్నాయని అన్నారు. భారత్‌లో పెద్దసంఖ్యలో ప్రజలు మధ్యతరగతిలోకి వస్తున్నారని, తమకు భారత్ మార్కెట్లో ఎన్నో సానుకూల అంశాలు కలిసివస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Hyderabad | ఐటీలో హైదరాబాద్‌కు సాటి లేదు.. ఉద్యోగ కల్పనలో 143 శాతం పెరుగుదల