ఆంథ్రోపిక్ ఐపీవో@90 బిలియన్ డాలర్లు!
అమెరికాకు చెందిన కత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత పరిశోధనల దిగ్గజం ఆంథ్రోపిక్ తన చారిత్రక ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)లో కంపెనీ విలువను 1.26-1.46 ట్రిలియన్ డాలర్లుగా లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంగళవారం అక్కడి రెగ్యులేటర్‌కు దాఖలు చేసిన పత్రాల్లో వెల్లడైంది.
- టెక్ ఇండస్ట్రీలో సర్వత్రా ఆసక్తి
శాన్ఫ్రాన్సిస్కో, నవంబర్ 10 : అమెరికాకు చెందిన కత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత పరిశోధనల దిగ్గజం ఆంథ్రోపిక్ తన చారిత్రక ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)లో కంపెనీ విలువను 1.26-1.46 ట్రిలియన్ డాలర్లుగా లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంగళవారం అక్కడి రెగ్యులేటర్‌కు దాఖలు చేసిన పత్రాల్లో వెల్లడైంది. దీంతో గతంలో చర్చకు వచ్చిన 2 ట్రిలియన్ డాలర్ల మొత్తంతో పోల్చితే ఇది తక్కువగా ఉండటం ఏఐపై ఇన్వెస్టర్ల ఆసక్తి చల్లారుతున్నదనడానికి సంకేతమేనంటూ మార్కెట్ నిపుణులు ఇప్పుడు అభివస్తున్నారు.
ధరల శ్రేణి 70-78 డాలర్లు
ఆంథ్రోపిక్ ఐపీవోలో ఒక్కో షేర్ ధరల శ్రేణి 70-78 డాలర్లుగా ఉన్నది. దీంతో కొందరు ఇన్వెస్టర్లు ఈ ఐపీవోలో 825 మిలియన్ల షేర్లను విక్రయించి గరిష్ఠంగా 64.4 బిలియన్ డాలర్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా మరో 26 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణకు వీలున్నది. ఫలితంగా మొత్తం ఈ పబ్లిక్ ఇష్యూలో 90 బిలియన్ డాలర్లకుపైగానే కంపెనీ మార్కెట్ నుంచి నిధులను సమీకరించబోతున్నది. నిజానికి అక్టోబర్‌లోనే ఐపీవో వస్తుందనుకున్నారంతా. కానీ ఈ నెల 18న ప్రైసింగ్ డేట్, 19న ట్రేడింగ్ డేట్ ఉండవచ్చని అంచనా.
కాగా, భారీ ఖర్చులు, పెరుగుతున్న రుణ భారం వల్ల కంపెనీ లాభాలపై మదుపర్లలో సందేహాలు నెలకొనడం ఐపీవోకు కొంత ప్రతికూలంగా మారుతున్నది. పైగా ఇటీవలి అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల భారీ విజయం తర్వాత.. ఇప్పటిదాకా పరుగులు పెట్టిన డాటా సెంటర్ల నిర్మాణం మందగిస్తుందన్న భయాలు సైతం ఏఐపట్ల మదుపర్లలో కొంత విముఖతకు దారితీశాయి. గత వారం నాస్డాక్లో టెక్నాలజీ కంపెనీలు తీవ్ర సెల్లింగ్ ప్రెషర్‌ను ఎదుర్కొనడంతో గడిచిన 19 నెలల్లో ఎప్పుడూ లేనంతగా సూచీ ఒక్కరోజే అత్యధిక పతనాన్ని నమోదు చేసింది. దీంతో ట్రిలియన్ల డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైన సంగతి విదితమే.
ఏఐపై రెఫరెండమ్?
ఇటీవలికాలంలో ఏఐ బూమ్ రిస్క్‌లో పడిన పరిస్థితులను చూస్తూనే ఉన్నాం. ఆయా టెక్నాలజీ దిగ్గజ సంస్థలు ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి మితిమీరి ఖర్చు చేస్తున్నాయన్న ఆందోళనలో మదుపర్లు పడిపోవడమే ఇందుకు కారణం. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టాక్ మార్కెట్లలో ఏఐ సంబంధిత, సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ నిధుల సమీకరణకు ఆంథ్రోపిక్ సిద్ధం కావడం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ఈ పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తే.. టెక్ ఇండస్ట్రీలో ఏఐపై కంపెనీలు పెడుతున్న పెట్టుబడులు లేదా ఖర్చులకు మదుపర్ల నుంచి పరోక్షంగా మద్దతు లభించినట్టేనని అంతా అంటున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఫలితాలు వస్తే మాత్రం.. పరిశ్రమలో అలజడులేనని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ ఐపీవో తీరుతెన్నులను యావత్తు టెక్ ఇండస్ట్రీ ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తున్నది. ఈ పబ్లిక్ ఇష్యూ ఆంథ్రోపిక్కేగాక, ఏఐపై ఆసక్తి చూపుతున్న అల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ వంటి అనేక బడా టెక్ సంస్థలకూ కీలకమని అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

