న్యూఢిల్లీ, డిసెంబర్ 20: అంతర్జాతీయ సంస్థ స్టార్బక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఆనంద్ వరదరాజన్ నియమితులయ్యారు. ఈ నియామకం వచ్చే నెల 19 నుంచి అమలులోకి రానున్నట్టు కంపెనీ సీఈవో బ్రియాన్ నికోల్ తెలిపారు. దీంతో అంతర్జాతీయ సంస్థల్లో మరో భారతీయుడు నియమించుకున్నట్టు అయింది.
సెప్టెంబర్లో కంపెనీ డెబ్ హాల్ తన సీటీవో పదవికి రాజీనామా చేసిన మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో నూతన వ్యక్తిని నియమించుకున్నది. గడిచిన 19 ఏండ్లుగా అమెజాన్లో పలు హోదాల్లో పనిచేసిన వరదరాజన్..అంతకుముందు ఓరాకిల్లో విధులు నిర్వహించారు.