ముంబై: వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర తన ట్వీట్లతో ఎప్పుడూ ప్రేరణాత్మక సందేశాలను ఇస్తుంటారు. అయితే తాజాగా చేసిన ఓ ట్వీట్లో ఆయన.. వ్యాపారంలో ఉండే కీలకమైన స్కిల్‌ను షేర్ చేశారు. ఓ కుక్క పిల్ల డోర్‌ను నెట్టే వీడియోను పోస్టు చేసిన ఆయన.. ఆ వీడియోకు ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్ పెట్టాడు. మూసి ఉన్న గ్లాసు డోర్‌ను నెట్టుతూ ఉన్న ఓ శునకం కెమెరాకు చిక్కింది. చివరకు డోరు తీసిన తర్వాత ఆ కుక్క పిల్ల పరుగులు తీసింది. మనకు అలవాటైన పద్ధతిలో వెళ్లడం కాదు.. వ్యాపారులు నేటి కాలంలో స్వేచ్ఛగా దారులు వెతుక్కోవాలని ఆయన సూచించారు. ఆనంద్ మహేంద్ర చేసిన ట్వీట్‌ను నెటిజెన్లు ఆహ్వానిస్తున్నారు. ఆన్లైన్లో ఆ ట్వీట్‌ను పోస్టు చేసిన కొన్ని రోజుల్లోనే మూడువేల లైక్‌లు వచ్చాయి. అనేక మంది రీట్వీట్ చేశారు. జీవితంలో మార్పులకు సిద్ధంగా ఉండాలని కొందరు సూచించారు.
No better way of illustrating our addiction to habit…The most valuable skill in business today is knowing how to break free… https://t.co/HQ7cmgxtyp
— anand mahindra (@anandmahindra) October 12, 2021