న్యూఢిల్లీ, జనవరి 20: అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ (ఏఎంఎస్ఎల్).. తెలంగాణలో రూ.300 కోట్ల పెట్టుబడితో ఓ నూతన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రో-మెకానికల్ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు మంగళవారం ప్రకటించింది. హైదరాబాద్లోని హార్డ్వేర్ పార్క్ ఫేజ్-2లో టీఎస్ఐఐసీ నుంచి 22,988 చదరపు మీటర్ల భూమిని పొందినట్టు ఎక్సేంజీలకు స్పష్టం చేసింది. కాగా, ఇక్కడ గ్రాడ్ రాకెట్స్, యాంటీ-సబ్మెరైన్ వార్ఫేర్ రాకెట్లు, యాంటీ-ట్యాంక్ మైన్లు, ఫిరంగి మందుగుండు సామగ్రి తదితర ఉత్పత్తుల తయారీ, ఫిట్టింగ్, టెస్టింగ్ జరుగుతుందని కంపెనీ చెప్తున్నది.