Cars Sales | గత 15 నెలలుగా 35 శాతం పైచిలుకు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వంటి ఇంధన ధరలు పెరిగాయి. దీని ప్రభావం ఓవరాల్గా వాహనాల నిర్వహణ వ్యయంపై పడుతోంది. ఈ నేపథ్యంలో అధిక ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, లోయర్ మెయింటెనెన్స్ కాస్ట్ గల కార్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకించి రూ.10 లక్షల్లోపు క్యాటగిరీ గల కార్లవైపు మొగ్గు చూపుతున్నారు.
70 శాతం ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ అంతా రూ.10 లక్షల్లోపు కార్లే విక్రయాలు జరుగుతున్నాయని మారుతి సుజుకి ఇండియా జోస్యం చెబుతున్నదని హెచ్ఎస్బీసీ గ్లోబల్ రీసెర్చ్ తెలిపింది. ప్రస్తుత మార్కెట్లో సుమారు 65 శాతం మారుతి సుజుకిదే.
గత పదేండ్లలో మారుతి సుజుకి కార్ల ఫ్యుయెల్ ఎఫిషియెన్సీ 15-30 శాతం పెరిగింది. ఉదాహరణకు మారుతి స్విఫ్ట్ లేదా స్విఫ్ట్ డిజైర్ కారు ఫ్యూయెల్ ఎఫిషియెన్సీ 18 కేఎంపీఎల్గా ఉంటే 23.3 కేఎంపీఎల్కు పెరిగింది.