ఆర్ధిక మాంద్యం భయాలతో ఆయిల్ మార్కెట్ షేక్ : దిగివస్తున్న చమురు ధరలు
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో పాటు చైనాలో కొవిడ్-19 నియంత్రణలను కఠినతరం చేయడంతో బుధవారం వరుసగా మూడో రోజూ చమురు ధరలు పతనమయ్యాయి.
న్యూయార్క్ : ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే భయాలతో పాటు చైనాలో కొవిడ్-19 నియంత్రణలను కఠినతరం చేయడంతో బుధవారం వరుసగా మూడో రోజూ చమురు ధరలు పతనమయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.5 శాతం తగ్గి 93.78 డాలర్లకు దిగివచ్చింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మిడియట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.8 శాతం పతనమై 88.66 డాలర్లకు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ ఆర్ధిక మాంద్యం ముప్పు పెరుగుతున్నదని ఐఎంఎఫ్ హెచ్చరిస్తూ 2023లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలో కోత విధించింది.
ప్రపంచంలో రెండో అతిపెద్ద చమురు వినియోగ దేశమైన చైనాలో కొవిడ్-19 నియంత్రణలను కఠినతరం చేయడంతో చమురు మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. ఆగస్ట్ తర్వాత చైనాలో అతిపెద్ద నగరాలైన షాంఘై, షెంజెన్ వంటి సిటీల్లో కేసుల పెరుగుదలతో కొవిడ్-19 టెస్టింగులు పెంచడం సహా పలు నియంత్రణలు చేపట్టారు. కొవిడ్-19 పాలసీలో ఎలాంటి సడలింపులు ఉండవని చైనా అధికారులు చెబుతుండటం చైనాలో చమురు డిమాండ్ మరింత తగ్గుతుందని ఏఎన్‌జడ్ రీసెర్చి అనలిస్ట్స్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేట్లలో కఠినంగా వ్యవహరించాలని ఆయా దేశాల కేంద్ర బ్యాంకులను ఐఎంఎఫ్ కోరింది. అమెరికన్ ద్రవ్యోల్బణ గణాంకాలు గురువారం వెల్లడికానుండటంతో ఇన్వెస్టర్లు కీలక డేటా కోసం వేచిచూస్తున్నారు. ఆర్ధిక మాంద్యం భయాలు నెలకొన్న నేపధ్యంలో ఈ గణాంకాలు మార్కెట్ దిశను నిర్ధేశిస్తాయని మార్కెట్ విశ్లేషకులు టినా టెంగ్ చెప్పుకొచ్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- declined
- Oil prices
- recession
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

