హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌కు శ్రీకారం చుట్టింది. ఈ నెల 23 నుంచి ప్రారంభంకానున్నది. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కైబర్లు ఒకరోజు ముందుగానే ఈ ఫెస్టివల్ సేల్‌లో పాల్గొనవచ్చునని తెలిపింది.
ఈ ఫెస్టివల్లో దేశవ్యాప్తంగా 17 లక్షల మందికి పైగా అమ్మకందారులు తమ ఉత్పత్తులను విక్రయించనుండగా, అదే తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నుంచి 80 వేల వరకు ఉంటారని అమెజాన్ ఇండియా డైరెక్టర్ తోట కిశోర్ తెలిపారు.