తెలంగాణలో అమెజాన్ డాటా సెంటర్
భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటవుతున్నది. 202 ఎకరాల్లో అతిపెద్ద హైపర్‌స్కేల్ డాటా సెంటర్‌ను అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) నిర్మించనుండగా, దీనికి సంబంధించి జరిగిన భూమి పూజలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కంపెనీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- ఫ్యూచర్ సిటీలో 202 ఎకరాల్లో ఏర్పాటుకానున్న ఏడబ్ల్యూఎస్ కేంద్రం
- వచ్చే పదేండ్లలో రూ.60,000 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, జూలై 15 : భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డాటా సెంటర్ ఏర్పాటవుతున్నది. 202 ఎకరాల్లో అతిపెద్ద హైపర్‌స్కేల్ డాటా సెంటర్‌ను అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) నిర్మించనుండగా, దీనికి సంబంధించి జరిగిన భూమి పూజలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, కంపెనీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వచ్చే పదేండ్లలో తెలంగాణలో రూ.60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ ముందుకొచ్చింది. కాగా, చందన్వెల్లిలో మరో డాటా సెంటర్ ప్రాజెక్టు కోసం కూడా ప్రభుత్వం అమెజాన్‌కు 98 ఎకరాలను కేటాయించింది. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 2034కల్లా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టాల్సిందిగా అమెజాన్‌ను కోరారు.
ఇదిలావుంటే ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులోనే అమెజాన్ డాటా సెంటర్ వస్తుండటంతో.. ఇది మరిన్ని గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలను ఆకర్షించగలదని, పెద్ద ఎత్తున అనుంధ రంగాల పెట్టుబడులను తీసుకురాగలదన్న ఆశాభావాన్ని సీఎం వ్యక్తం చేశారు. ఈ డాటా సెంటర్‌తో మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగావకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోగలవన్న విశ్వాసాన్నీ వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

