Amazon | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ అమెజాన్ సంస్థ తమ ఉద్యోగు ల వేతనాలను భారీగా పెంచబోతున్నది. ఇప్పటివరకు సంస్థ గరిష్ఠంగా 1.60 లక్షల వేతనం వచ్చేది. కానీ ఇప్పుడు అమెరికాలోని సంస్థలో పని చేస్తున్న సంస్థ ఉద్యోగుల కనీస వేతనం రూ.3.5 లక్షల డాలర్లకు పెరగనున్నది. అంటే వేతనం రెట్టింపు కానున్నది. టెక్నాలజీ, కార్పొరేట్ విభాగాలకు కూడా ఈ వేతనం పెంపు వర్తిస్తుంది. సిబ్బంది పనితీరు ఆధారంగా శాలరీ పెంచేవారు.
ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులతోపాటు కొత్తగా నియమకాలు చేపట్టనున్నట్లు అమెజాన్ వెల్లడంచింది. ప్రస్తుత పోటీ మార్కెట్లో ప్రతిభావంతులను కాపాడుకోవడంతోపాటు బయటి నుంచి టాలెంట్ ఉన్నవారిని ఆకర్షించడం తమ లక్ష్యం అని తెలిపింది. సిబ్బందిని కాపాడుకునేందుకు అర్థవంతమైన వేతన పెంపు ఉంటుందని సూచించింది.
సిబ్బంది బేసిక్ శాలరీని బట్టి పరిహారం ఉంటుందని, అయితే, స్టాక్ యూనిట్లలో ఆంక్షల్లేకుండా సైన్ ఆన్ బోనస్లు, ఇతర బెనిఫిట్లు లభిస్తాయని అమెజాన్ చెప్పింది. గతేడాది సగటు సిబ్బంది వేతనాలు గంటలకు 18 డాలర్ల చొప్పున పెంచింది. వేర్హౌస్, ట్రాన్స్పోర్టేషన్ రంగాల్లో 1.25 లక్షల మందిని నియమించుకోనున్నామని వివరించింది.