Amazon Prime | ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అనుబంధ అమెజాన్ ప్రైమ్ తన యూజర్లకు షాక్ ఇచ్చింది. సబ్స్క్రిప్షన్ ధరలు భారీగా పెంచేసింది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఏకాఎకీన 67 శాతం పెంచిన అమెజాన్ ప్రైమ్.. త్రైమాసిక ప్లాన్‌నూ పెంచేసింది. వార్షిక ప్లాన్ మాత్రం యధాతథంగా కొనసాగిస్తున్నది. పెరిగిన సబ్స్క్రిప్షన్ టారిఫ్‌లు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇప్పటికే సబ్స్క్రిప్షన్ పొందిన వారికి వచ్చే ఏడాది (2024) జనవరి 15 వరకు పాత ధరలే అమలులో ఉంటాయి. ఒకవేళ ఏ కారణంతోనైనా రెన్యూవల్ ఫెయిలైతే కొత్త టారిఫ్ ప్లాన్లు కొనుగోలు చేయాల్సిందే.
అమెజాన్ ప్రైమ్ నెలవారీ సబ్స్క్రిప్షన్ ఇప్పటి దాక రూ.179 కాగా, తాజాగా రూ.299లకు పెంచుతున్నట్లు గురువారం తెలిపింది. మూడు నెలల సబ్స్క్రిప్షన్ రూ.459 నుంచి 599కి పెంచివేసింది. వార్షిక సబ్స్క్రిప్షన్ రూ.1499. యధాతథంగా కొనసాగిస్తున్నది. ఇక రూ.999లకే అమెజాన్ లైట్ వార్షిక సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. ఈ ఆప్షన్లో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ సదుపాయాలన్నీ వర్తించినా.. ప్రైమ్ వీడియో కంటెంట్ ఎస్డీ క్వాలిటీలో మాత్రమే చూడటానికి వీలు ఉంది. మధ్యలో వాణిజ్య ప్రకటనలు జారీ అవుతుంటాయి.
అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ పొందిన యూజర్లకు ఆర్డర్ విలువతో సంబంధం లేకుండా ఫ్రీ-డెలివరీ ఫెసిలిటీ, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ వంటి వసతులు అమెజాన్ అందిస్తున్నది. ప్రైమ్ సబ్‌స్ర్కైబర్ల కోసం ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తుంది. లైటనింగ డీల్స్ వంటి వసతులు కల్పిస్తున్నది. 2016లో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ 2016లో భారత్‌లో ప్రవేశ పెట్టగా, 2018లో నెలవారీ సబ్స్క్రిప్షన్ విధానాన్ని తెచ్చింది.