Amazon Prime Lite | అమెజాన్ అనుబంధ ఓటీటీ ప్లాట్ ఫామ్.. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) తన సబ్ స్క్రిప్షన్ టారిఫ్‌పై తగ్గింది. ఇంతకుముందు రూ.999లకే లభించిన సబ్ స్క్రిప్షన్ టారిఫ్ రూ.1499కి పెంచడంతో సబ్ స్ర్కైబర్లు కొత్త సబ్ స్క్రిప్షన్ తీసుకోవడానికి గానీ, రెన్యూవల్ చేసుకోవడానికి గానీ వెనుకాడుతున్నారు. దీంతో కాస్త వెనుకంజ వేసిన అమెజాన్ కొత్తగా.. రూ.999లకే అమెజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో రెగ్యులర్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లోని బెనిఫిట్లే అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్‌లో దాదాపు ప్రైమ్ సబ్స్క్రిప్షన్ బెనిఫిట్లే ఇస్తున్నా యూజర్లకు కొన్ని సేవలు లభించవు. రెగ్యులర్ ప్లాన్‌లో భాగంగా వన్ డే డెలివరీ, సేమ్‌డే డెలివరీ వసతి లైట్ ప్లాన్‌లో ఉండదు. అలాగే ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ మ్యూజిక్ యాక్సెస్ ఉండదు.రెగ్యులర్ ప్రైమ్ సభ్యులు ప్రైమ్ వీడియోనూ 4కే క్వాలిటీతో ఒకేసారి ఆరు డివైజ్ ల్లో వీక్షించవచ్చు. కానీ లైట్ ప్లాన్ కింద రెండు డివైజ్‌ల్లోనే వీక్షించడానికి వీలవుతుంది. ప్రైమ్ లైట్ ప్లాన్ లో భాగంగా యాడ్స్ కూడా వస్తాయి.