Amazon Great Indian Festival | దేశవ్యాప్తంగా పండుగల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్.. పండుగల సేల్.. ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్-2023’ తీసుకొచ్చింది. అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి ఈ ఆఫర్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది అమెజాన్. ఓలెడ్, క్యూలెడ్ అండ్ 4కే డిస్ ప్లే గల శాంసంగ్, వన్ ప్లస్, సోనీ, ఎల్జీ, షియోమీ బ్రాండ్ల స్మార్ట్ టీవీల ధరలపై 60 శాతం వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో జరిపే లావాదేవీలపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా షాపుల యాజమాన్యాలు కూపన్-బేస్డ్ డిస్కౌంట్లు, పేమెంట్ బేస్డ్ ఆఫర్లు, నో-ఈఎంఐ ఆప్షన్లు అందిస్తాయి.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ -2023 సేల్స్ అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. ఈ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఎప్పటికప్పుడు ఆఫర్లను అప్ డేట్ చేస్తూ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రైబర్లకు అక్టోబర్ ఏడో తేదీ నుంచే ఆఫర్లు, డిస్కౌంట్లు లభిస్తాయి.