Amazon : టెక్ దిగ్గజం అమెజాన్‌లో కొలువుల కోత కొనసాగుతోంది. దశల వారీగా లేఆఫ్స్‌కు తెగబడుతున్న ఈ-కామర్స్ దిగ్గజం తాజాగా ఫార్మసీ, వన్ మెడికల్ యూనిట్స్‌లో వందలాది ఉద్యోగులపై వేటువేసింది. ఉద్యోగులకు పంపిన మెమోలో అమెజాన్ హెల్త్ సర్వీసెస్ హెడ్ నీల్ లిండ్సే లేఆఫ్స్ బాంబు పేల్చారు.
పునర్వ్యవస్ధీకరణ ప్రక్రియ ఫలితంగా వన్ మెడికల్, అమెజాన్ ఫార్మసీ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని లిండ్సే వివరించారు. 2022 నుంచి ఇప్పటివరకూ అమెజాన్ పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దాదాపు 27,000 మందికి పైగా ఉద్యోగులను వివిధ దశల్లో సాగనంపింది.
కంపెనీ సీఈవో ఆండీ జస్సీ వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా మాస్ లేఆఫ్స్ ఉద్యోగులను వణికిస్తున్నాయి. ఓవైపు ఎడాపెడా లేఆఫ్స్‌కు తెగబడుతున్న అమెజాన్ తిరిగి కార్యాలయాలకు రావాలనే విధానాన్ని (ఆర్టీఓ) పాటించని ఉద్యోగులకు తక్కువ సామర్ధ్య రేటింగ్స్ ఇవ్వాలని మేనేజర్లను కోరుతున్నట్టు సమాచారం. కార్యాలయాలకు హాజరు కాని ఉద్యోగుల పదోన్నతులను కంపెనీ తొక్కిపెట్టవచ్చని టెకీల్లో గుబులు రేగుతోంది.
Read More :