బెంగళూరు, అక్టోబర్ 11: దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని అమెజాన్ ఇండియా ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్లలో భాగంగా 70 శాతం వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. దీంతోపాటు క్రెడిట్ కార్డు, పలు ఎంపిక చేసిన కార్డులపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ కల్పిస్తున్నది.
యాక్సిస్ బ్యాంక్, ఆర్బీఎల్, ఐడీఎఫ్సీ, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు చెందిన క్రెడిట్ కార్డులతోపాటు ఐడీఎఫ్సీ డెబిట్ కార్డుతో కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్ వర్తించనున్నది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడంతో అన్ని రకాల ఉత్పత్తుల ధరలను తగ్గించినట్టు పేర్కొంది. దీంతో ప్రస్తుత పండుగ సీజన్లో గృహోపకరణాలతోపాటు ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తులకు డిమాండ్ భారీగా పెరిగింది.