లండన్ : ఈ ఏడాది చివరి నాటికి ఈ కామర్స్ దిగ్గజం బిట్‌కాయిన్ చెల్లింపులను అంగీకరించనున్నట్టు వెలువడిన మీడియా కథనాన్ని అమెజాన్ తోసిపుచ్చింది. లండన్ పత్రికలో వచ్చిన ఈ కథనాన్ని అమెజాన్ తోసిపుచ్చుతూ క్రిప్టోకరెన్సీలపై తమ నిర్ధిష్ట ప్రణాళికలకు సంబంధించి సాగుతున్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.
తమ ప్లాట్‌ఫాంపై షాపింగ్ చేసే కస్టమర్లకు ఇది ఎలా ఉపయోగకరమనే దానిపై తాము దృష్టి కేంద్రీకరించామని అమెజాన్ ప్రతినిధి పేర్కొన్నారు. కాగా డిజిటల్ కరెన్సీ, బ్లాక్‌చైన్ ప్రొడక్ట్ లీడ్ కోసం జులై 22న కంపెనీ ఉద్యోగులను ఆహ్వానించింది. గత కొన్నేండ్లుగా క్రిప్టోకరెన్సీలను ప్రధాన ఆర్ధిక సంస్ధలు నిరాకరిస్తున్నప్పటికీ చెల్లింపుల కోసం వర్చువల్ కరెన్సీలను ఇటీవల పలు కంపెనీలు ఆమోదిస్తున్నాయి. ఇక బిట్‌కాయిన్ చెల్లింపులను తాము తిరిగి అంగీకరిస్తామని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇంక్ సీఈఓ ఎలన్ మస్క్ గతవారం వెల్లడించారు.