న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో (Amazon Layoffs) మరో దశ లేఆఫ్స్‌కు తెరలేచింది. లేటెస్ట్గా అమెరికాలో అమెజాన్ ఫ్రెష్ గ్రాసరీ స్టోర్స్ ఉద్యోగులపై ఈ-కామర్స్ కంపెనీ వేటు వేసింది. ఆర్ధిక మందగమనంతో పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికలో భాగంగా అమెజాన్ జూనియర్ లెవెల్స్‌లో వందలాది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తోంది.
ఆన్లైన్ పేమెంట్స్‌ను ప్రోత్సహించే ప్రక్రియలో గ్రాసరీ స్టోర్ల ఆధునీకరణతో అమెజాన్ ఫ్రెష్ గ్రాసరీ స్టోర్స్‌లో క్యాషియర్ డెస్క్‌లు కనుమరుగయ్యాయి. అమెజాన్ ఫార్మసీ డివిజన్లో సిబ్బంది తొలగింపు అనంతరం అమెజాన్ ఫ్రెష్ స్టోర్స్‌లో లేఆఫ్స్ కలకలం రేపాయి. అమెరికాలో 44 అమెజాన్ ఫ్రెష్ స్టోర్స్‌ను అమెజాన్ నిర్వహిస్తుండగా వీరిలో పలువురు తమ ఉద్యోగాలు కోల్పోయారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. కొలువులు కోల్పోయిన వారు అమెజాన్‌లో ఇతర పోస్టులకు దరఖాస్తు చేయవచ్చని లేకుంటే పరిహార ప్యాకేజ్‌ను అంగీకరించాలని కంపెనీ కోరినట్టు తెలిపింది.
కొలువులు కోల్పోయిన ఉద్యోగులకు కంపెనీ రెండు మాసాల వేతనంతో కూడిన పరిహార ప్యాకేజ్‌ను వర్తింపచేస్తోందని ఓ మాజీ ఉద్యోగి చెప్పినట్టు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అమెజాన్ ఫ్రెష్ సామర్ధ్యం పెంపెనకు, దీర్ఘకాల వృద్ధిని దృష్టిలో ఉంచుకుని తాజా లేఆఫ్స్‌కు నిర్ణయం తీసుకున్నామని అమెజాన్ ప్రతినిధి జెస్సికా మార్టిన్ చెప్పుకొచ్చారు. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ అమెజాన్ రోల్స్‌లో సర్దుబాటు చేస్తామని తెలిపారు.
Read More :
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద.. మహోగ్రరూపం దాల్చిన గోదావరి