న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం లేటెస్ట్ లేఆఫ్స్‌తో (Amazon Layoffs) టెకీల్లో గుబులు రేగుతోంది. వ్యాపార పునర్వ్యవస్ధీకరణ పేరుతో అమెజాన్ వారంలో రెండోసారి లేఆఫ్స్‌కు తెగబడటం ఆందోళన రేకెత్తిస్తోంది. గేమింగ్ డివిజన్లో 180 మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది. వృద్ధికి సానుకూలంగా ఉన్న రంగాల్లో పునర్వ్యవస్ధీకరణ చేపట్టే క్రమంలో వ్యూహాత్మక చర్యగా ఉద్యోగుల సంఖ్యను కుదించాల్సి వచ్చిందని ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో అమెజాన్ పేర్కొంది.
వ్యాపారాలను ముందుకు తీసుకువెళ్లేందుకు, మెరుగైన వృద్ధి రేటు కోసం పునర్వ్యవస్ధీకరణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించామని అమెజాన్ గేమ్స్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టాఫ్ హట్మన్ ఉద్యోగులకు పంపిన అధికారిక ఈమెయిల్లో పేర్కొన్నారు. కాగా గతవారం అమెజాన్ తన స్ట్రీమింగ్ మ్యూజిక్, పాడ్‌కాస్ట్ డివిజన్లో పలువురు ఉద్యోగులను తొలగించింది.
పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీగా పేరొందిన హెచ్ఆర్ విభాగంలోనూ కొందరు ఉద్యోగులను అమెజాన్ విధుల నుంచి తొలగించింది. గేమ్స్ డివిజన్లో తాజా లేఆఫ్స్ రెండో దశ కావడం గమనార్హం. గతంలో గేమింగ్ యూనిట్లో కంపెనీ 100 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇక గత ఏడాది ఆర్ధిక మాంద్య భయాలు, మందగమనం వెంటాడటంతో అమెజాన్ ఏకంగా 27,000 మంది ఉద్యోగులను తొలగించింది.
Read More :
Retail Market | దేశీయ రిటైల్ మార్కెట్‌కు పండుగ కళ.. రూ.3.75 లక్షల కోట్ల అమ్మకాలు