హైదరాబాద్, నవంబర్ 3: అమర రాజా బ్యాటరీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.201.22 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.144.32 కోట్ల లాభంతో పోలిస్తే 39.42 శాతం అధికమని పేర్కొంది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,264.15 కోట్ల నుంచి రూ.2,700.47 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు, రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.2.90 మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రతిపాదించింది.