హైదరాబాద్, జూన్ 30: గ్రీన్కో ఎనర్జీ హోల్డింగ్స్‌లో 17.5 శాతం వాటాను ఏఎం గ్రీన్ బీవీ కొనుగోలు చేసింది. ఏఎం గ్రీన్ పవర్ బీవీకి చెందిన సబ్సిడరీ సంస్థయైన ఒరిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాను గ్రీన్కో ఎనర్జీ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం జూలై చివరినాటికి పూర్తికానున్నదని ఏఎం గ్రీన్ ఫౌండర్, సీఈవో అనిల్ చలమశెట్టి తెలిపారు. పూర్తిస్థాయిలో ప్రపంచస్థాయి ఇంటిగ్రేటెడ్, స్కేలబుల్ గ్రీన్ ఎనర్జీ ప్లాట్‌ఫాంను నెలకొల్పడానికి ఈ ఒప్పందం దోహదం చేయనున్నదన్నారు. 2030 నాటికి గ్రీన్కో సంస్థ 10 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నది.
ఎన్సీసీకి రూ.1,690 కోట్ల ఆర్డర్
హైదరాబాద్, జూన్ 30: ఎన్సీసీ లిమిటెడ్ మరో భారీ ప్రాజెక్టులను చేజిక్కించుకున్నది. జూన్ నెలలో రూ.1,690.51 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఏజెన్సీలు, ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి బిల్డింగ్ డివిజన్ల నుంచి ఈ ఆర్డర్లు లభించాయని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.