హైదరాబాద్, జూలై 3: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్(హెచ్ఎంఏ) నూతన అధ్యక్షుడిగా అల్వాల దేవేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను హెచ్ఎంఏ నూతన కార్యవర్గాన్ని గురువారం ప్రకటించింది.
అలాగే శరత్ చంద్ర ఉపాధ్యక్షుడిగాను, కార్యదర్శిగా వాసుదేవన్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..పలు పరిశ్రమల్లో యాజమాన్య విధానాలను మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు ప్రకటించారు.