Crypto Penalties | క్రిప్టో రూల్స్.. ఉల్లంఘిస్తే రూ.20 కోట్ల పెనాల్టీ?!
Crypto Penalties | క్రిప్టోలపై పూర్తి నిరోధానికి బదులు నియంత్రణకు సిద్ధమైన కేంద్రం.. వాటి కట్టడికి కఠిన నిబంధనలు తెస్తోంది.

Crypto Penalties | ఆర్థిక వ్యవస్థలో ఒడిదొడుకులకు కారణమవుతాయని భావిస్తున్న ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ లావాదేవీల భవితవ్యంపై కమ్ముకున్న మబ్బులు తొలగిపోనున్నాయా.. అవుననే సమాధానమే వస్తున్నది. అయితే కేంద్రం త్వరలో తేనున్న చట్టంలో కఠిన నిబంధనలు చేర్చనున్నది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 18 నెలల వరకూ జైలు, రూ.20 కోట్ల వరకూ జరిమానా విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలను చట్ట విరుద్ధ కార్యకలాపాలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించకుండా నిరోధించేందుకు సంబంధిత చట్టాల్లో సవరణలు తీసుకొస్తారని తెలుస్తున్నది.
క్రిప్టోల మాయ కట్టడికి కేంద్రం ఇలా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అలజడి సృష్టిస్తున్న క్రిప్టో కరెన్సీల మాయకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. వాటి ఆట కట్టించడానికి రూపొందించిన బిల్లుపై సర్క్యులేట్ చేసిన క్యాబినెట్ నోటు మాత్రం క్రిప్టోలపై పూర్తి నిషేధం విధించబోవడం లేదని చెబుతున్నది. బిట్ కాయిన్, ఎథీరియం, డోజ్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను దేశంలో చట్టబద్ధమైన కరెన్సీగా పరిగణించబోమని క్యాబినెట్ నోట్లో పేర్కొన్నట్లు తెలియవచ్చింది. క్రిప్టో కరెన్సీని క్రిప్టో అసెట్‌గా పరిగణిస్తామని ఆ నోట్లో వ్యాఖ్యానించినట్లు సమాచారం.
సెబీకి పూర్తి రెగ్యులేషన్ పవర్స్
దేశీయ స్టాక్ మార్కెట్లను నియంత్రిస్తున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) పరిధిలోకి దేశంలో ఇప్పుడు లావాదేవీలు నిర్వహిస్తున్న క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫామ్‌లను తీసుకు రావాలని కేంద్రం తలపోస్తున్నది. క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ల్లో క్రిప్టో అసెట్స్ లావాదేవీలను సెబీ పర్యవేక్షిస్తున్నది.
క్రిప్టో అసెట్స్ ప్రకటనకు కటాఫ్ డేట్?
క్రిప్టో కరెన్సీలు కలిగి ఉన్నవారు వాటిని తమ క్రిప్టో కరెన్సీ అసెట్స్‌గా ప్రకటించడానికి కటాఫ్ డేట్‌ను ఖరారు చేస్తారు. ఆర్బీఐ ప్రతిపాదిస్తున్న వర్చువల్ కరెన్సీని.. న్యూ క్రిప్టో బిల్లు పరిధిలోకి తేవడం లేదని తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ నియంత్రణ అంశాలను ఆర్బీఐ కూడా పర్యవేక్షిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 18 నెలల జైలుశిక్ష, రూ.5-20 కోట్ల మేరకు పెనాల్టీ విధించాలని బిల్లులో ప్రతిపాదించినట్లు వినికిడి.
మనీ లాండరింగ్ చట్టానికీ పదును
ఈ క్రిప్టో అసెట్స్‌ను ఉగ్రవాద కార్యకలాపాలకు వాడకుండా నిరోధించడానికి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ)లో కేంద్రం అవసరమైన సవరణలు తీసుకు రానున్నది. ఇక తాము చలామణిలోకి తేనున్న డిజిటల్ కరెన్సీకి బ్యాంక్ నోట్ అని నిర్వచనం ఇవ్వాలని ఆర్బీఐ నుంచి ప్రతిపాదన వచ్చిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

