ముంబై, మే 24: బ్రిటన్కు చెందిన ప్రీమియం మోటర్సైకిళ్ళ తయారీ సంస్థ ట్రయింఫ్..దేశీయ మార్కెట్లోకి టైగర్ 1200 అడ్వెంచర్ బైకును పరిచయం చేసింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ.19.19 లక్షలుగా నిర్ణయించింది.
టైగర్ 1200 పరిధి మరింత విస్తరించడానికి ఈ సరికొత్త బైకులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.