ముంబై, జూలై 7: ఆకాశ ఎయిర్‌లైన్స్ టేకాఫ్ అవడానికి సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించి విమాన నియంత్రణ మండలి డీజీసీఏ నుంచి ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్(ఏవోసీ) జారీ అయినట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఈ నెల చివర్లోనే విమాన సేవలు ఆరంభించబోతున్నట్లు ప్రకటించింది.
విమాన సేవలు అందించడానికి అవసరమైన అన్ని రకాల అనుమతులు లభించాయని పేర్కొంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఝున్‌ఝున్‌వాలా ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ విమానయాన సంస్థ చేతిలోకి బోయింగ్ 737 మ్యాక్ ఎయిర్‌క్రాఫ్ట్ చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 18 విమానాలతో సర్వీసులు అందించనున్నట్లు ప్రకటించింది.