న్యూఢిల్లీ, మే 14: దేశీయ టెలికాం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్..దేశవ్యాప్తంగా ఎడ్జ్ డాటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. వచ్చే రెండేండ్లకాలంలో దేశవ్యాప్తంగా 56 ఎడ్జ్ డాటా సెంటర్లను నెలకొల్పబోతున్నట్టు భారతీ ఎయిర్టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ తెలిపారు. కంపెనీ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించాలనే ఉద్దేశంతో ఈ సెంటర్లు నెలకొల్పాలని నిర్ణయించారు.