న్యూఢిల్లీ, మే 19: ప్రముఖ టెలికాం సేవల సంస్థ ఎయిర్టెల్..పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం నూతన సేవలను ఆరంభించింది. ప్రయారిటీ పోస్ట్ పెయిడ్ పేరుతో ఈ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఈ సేవల కింద అంతరాయం లేని, నమ్మకమైన కనెక్టివిటీ లభించనున్నదని ఒక ప్రకటనలో వెల్లడించింది. 5జీ నెట్వర్క్ ైస్లెసింగ్ టెక్నాలజీలో భాగంగా ఈ నూతన సేవలను ప్రారంభించినట్టు కంపెనీ ఎండీ, సీఈవో శశ్వంత్ శర్మ తెలిపారు. ఇలాంటి నూతన సేవలు ప్రారంభించిన తొలి దేశీయ సంస్థ ఎయిర్టెల్ కావడం విశేషమన్న ఆయన… అన్ని పోస్ట్‌పెయిడ్ ప్లాన్లకు ఎయిర్టెల్ ప్రయారిటీ సేవలు లభించనున్నాయని చెప్పారు. ఇప్పటికే సంస్థకు చెందిన పోస్ట్‌పెయిడ్ సేవలు వినియోగిస్తున్న యూజర్లు ఆటోమేటిక్‌గా ఈ సేవల పరిధిలోకి రానున్నట్టు తెలిపారు. ప్రీపెయిడ్ యూజర్లు లేదా ఇతర నెట్వర్క్ కస్టమర్ల ఎయిర్టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్ సేవలు పొందాలంటే కంపెనీ యాప్ లేదా స్టోర్లను సంప్రదించాలని సూచించింది. ఈ ప్లాన్లు రూ.449 మొదలుకొని రూ.1,749 లోపు లభించనున్నాయి. ఆయా ప్లాన్ల కింద అపరిమిత కాల్స్, డాటాతోపాటు 3 వేల ఎస్ఎంఎస్లు, స్పామ్ అలర్ట్ లభించనున్నాయి. వీటితోపాటు అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ, నెట్‌ఫ్లిక్స్ కూడా సబ్స్క్రిప్షన్ ఫీజుతో పొందవచ్చును. ఇప్పటికే సంస్థ అమెరికా, సింగపూర్, బ్రిటన్, మలేషియా దేశాల్లో 5జీ సేవలను ప్రారంభించింది.