Air India | ఎయిర్ ఇండియాలోకి మరిన్ని విమానాలు.. కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్..!
Air India | ఎయిర్ ఇండియా కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలను కొనుగోలు చేయబోతున్నది. ఈ మేరకు ఫ్రెంచ్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో పది A350, 90 నారోబాడీ A320తో పాటు ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్ A321 నియో ఉన్నాయి.
Air India | ఎయిర్ ఇండియా కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలను కొనుగోలు చేయబోతున్నది. ఈ మేరకు ఫ్రెంచ్ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో పది A350, 90 నారోబాడీ A320తో పాటు ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్ A321 నియో ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఇచ్చిన ఆర్డర్ గతేడాది ఎయిర్‌బస్, బోయింగ్‌కు ఇచ్చిన ఆర్డర్‌కు భిన్నంగా ఉన్నది. తాజా ఆర్డర్‌తో ఎయిర్‌బస్‌కు ఎయిర్ ఇండియా ఇచ్చిన విమానాల ఆర్డర్ సంఖ్య 350కి పెరిగింది. గతేడాది దేశీయ విమానయాన కంపెనీ ఎయిర్‌బస్‌కు 250 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 40 A350 విమానాలు, 210 A320 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుత నిర్వహణ అవసరాల కోసం ఎయిర్‌బస్ ఫ్లైట్ అవర్ సర్వీసెస్ కాంపోనెంట్ (FHS-C)ని ఎంచుకున్నట్లు ప్రకటించింది. టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. భారతదేశ ప్రయాణికుల సంఖ్య ప్రపంచంలోని ఇతర దేశాల కంటే వేగంగా పెరుగుతోందన్నారు. కొత్తగా ఆర్డర్ ఇచ్చిన వంద ఎయిర్‌బస్ విమానాలు.. ఎయిర్‌లైన్స్‌ను వృద్థి పథంలో తీసుకెళ్లడంతో పాటు.. భారతదేశాన్ని అనుసంధానించే ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మార్చే మా మిషన్‌కు దోహదం చేస్తాయన్నారు. ఎయిర్ బస్ సీఈవో గ్విలౌమె ఫౌరీ మాట్లాడుతూ ఇటీవల భారత విమానయాన రంగం విపరీతమైన వృద్ధిని వ్యక్తిగతంగా చూశానన్నారు.
ఎయిర్‌బస్‌పై ఎయిర్ ఇండియా నమ్మకాన్ని చూసి సంతోషిస్తున్నాన్నారు. తాజా ఆర్డర్ తర్వాత ఎయిర్‌బస్ మొత్తం 344 కొత్త విమానాలను ఎయిర్ ఇండియాకు డెలివరీ చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు ఆరు A350 విమానాలు డెలివరీ చేసింది. ఎయిర్ ఇండియా 2023లో బోయింగ్ నుంచి 220 వైడ్‌బాడీ, నారోబాడీ విమానాలను ఆర్డర్ చేసింది. అందులో 185 విమానాలు ఇంకా డెలివరీ చేయాల్సి ఉంది. రోల్స్ రాయిస్ ట్రెంట్ ఎక్స్డబ్ల్యుబి ఇంజిన్‌తో నడిచే ఎయిర్‌బస్ ఎ350ని నడుపుతున్న తొలి భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియానే. అసాధారణమైన ఇంధన సామర్థ్యం, ప్రయాణీకుల సౌలభ్యం, సుదూరం ప్రయాణించే సామర్థ్యం ఉన్నది. A350 విమానాలు ఢిల్లీ నుంచి లండన్, న్యూయార్క్‌కు నాన్‌స్టాప్‌గా ప్రయాణించే సరికొత్త ఫ్లయింగ్ అనుభవాన్ని అందిస్తాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
Health tips | రోజుకో బాయిల్డ్ ఎగ్ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
సాకివాగులో ఘనంగా జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు
లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
Man Killed, Cop Injured In Firing | బంగారం లావాదేవీపై వివాదం.. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి, పోలీస్ అధికారికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

