Air India | న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఎయిర్ ఇండియా ప్రయాణికులకు వైర్లెస్ ఎంటర్టైన్మెంట్ సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవలు పెద్ద విమానాల్లో మాత్రమే అందిస్తున్నట్లు, దశలవారీగా మిగతా విమానాల్లో కూడా ప్రారంభించబోతున్నది. విమాన ప్రయాణ సమయంలో వినోదం అందించాలనే ఉద్దేశంతో విస్తా పేరుతో ఈ నూతన సేవలకు శ్రీకారం చుట్టినట్లు, ప్రస్తుతం బీ777, ఏ350 ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో మాత్రమే అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రయాణికులు తమ డివైజుల్లో ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను తిలకించవచ్చునని తెలిపింది.